ఖమ్మం జిల్లా కారేపల్లిలో విషాదం చోటుచేసుకొంది. బర్రెలు మేపడానికి వెళ్లిన ఏడేళ్ల బాలుడు చెరువులో పడి మృతిచెందాడు.
కారేపల్లికి చెందిన బాలకృష్ణ-త్రివేణి దంపతుల కుమారుడు కంటేశ్వర్. తాత, అన్నయ్య వరసయ్యే వ్యక్తితో కలిసి పెద్ద చెరువు సమీపంలోని తులస్యా తండా వైపు బర్రెలు మేపేందుకు వెళ్లారు. తాత పొలం వైపు వెళ్లగా.. కాళ్లకు అంటుకున్న బురద కడుక్కొని వస్తానని చెప్పి.. చెరువు వైపు వెళ్లాడు.
ఎంతసేపటికీ రాకపోవడంతో కంగారుపడ్డ సోదరుడు, తాత చుట్టుపక్కల గాలించారు. చెరువు సమీపంలో కండువా కనిపించడం వల్ల అందులో వెతికారు. చెరువులో బాలుడి మృతదేహం చూసి ఒక్కసారిగా అంతా హతాసులయ్యారు.
ఇవీచూడండి: ముత్తంగిలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో టిప్పర్ను ఢీకొని ఇద్దరి మృతి..