రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు జనగామలోని దాయనిలయం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లా రాజపేట మండలానికి చెందిన భూక్య గంగారాం, ముడావత్ రవీందర్ అనే ఇద్దరు బొలెరో వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.
నిందితుల నుంచి 35 క్వింటాళ్ల బియ్యం, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచూడండి.. వాట్సాప్ లంచం: జీహెచ్‌ఎంసీలో పాతికవేలిస్తే పదోన్నతి...