మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్దవార్వల్ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో 77 కిలోల అమ్మోనియం నైట్రేట్, 74 డిటెక్టర్‌లతో పాటు 5 కిలోల యూరియాను కనుగొన్నారు.
కొండ ప్రాంతాల్లో ఉన్న రాళ్లను పేల్చేందుకు ఈ అమ్మోనియం నైట్రేట్, డిటెక్టర్లను నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి.. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం.. పట్టుకున్న పోలీసులు