ETV Bharat / jagte-raho

సీసీ ఫుటేజీ సాయంతో బంగారు ఆభరణాల సంచి పట్టివేత

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలంలో ఓ వ్యక్తి ప్రైవేట్ క్యాబ్​లో మర్చిపోయిన సంచిని పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. సంచిలో ఉన్న 5 తులాల బంగారాన్ని బాధితునికి అందజేశారు.

author img

By

Published : Jan 7, 2021, 12:35 PM IST

police caught jewellery bag with cctv help
సీసీఫుటేజీ సాయంతో బంగారు ఆభరణాల సంచి పట్టివేత

భూపాలపల్లి జిల్లా ఘన్​పూర్​ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఇంద్రసేనా రెడ్డి వృత్తి రీత్యా హైదరాబాద్​లో నివసిస్తుంటారు. పని నిమిత్తం కుటుంబంతో కలిసి ప్రైవేట్ క్యాబ్​లో స్వగ్రామానికి బయలుదేరారు.

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలకేంద్రంలో అంబేడ్కర్ సెంటర్ వద్ద దిగిన ఇంద్రసేనా రెడ్డి కుటుంబం క్యాబ్​లో 5 తులాల బంగారమున్న సంచిని మరిచిపోయారు. గ్రహించిన వెంటనే పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఐ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పరకాల ఎస్సై వెంకటకృష్ణ, ఇతర సిబ్బంది పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా క్యాబ్​ను గుర్తించి డ్రైవర్ వద్ద నుంచి బంగారు ఆభరణాలున్న సంచిని స్వాధీనం చేసుకున్నారు. పోయిన సంచిని పోలీసుల నుంచి తీసుకున్న ఇంద్రసేనా రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.