హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ ఇన్స్‌పెక్టర్ కె.సైదులుపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం బోరబండ ఇందిరా నగర్‌లోని ఆంజనేయస్వామి దేవాలయ విగ్రహం తొలగింపు కార్యక్రమం జరిగింది. ఆ విషయంలో నీలం భార్గవ్ అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి.. అసభ్యకరంగా కులం పేరుతో దూషించాడని నీలం భార్గవ్ తల్లి హేమావతి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అదే స్టేషన్‌లో సీఐ సైదులుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అదే స్టేషన్లో పనిచేసే అజయ్ కుమార్‌ను నియమించారు.
ఇదీ చూడండి: గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?