యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన గ్యాద వెంకటేష్(42) మృతి చెందాడు. ఉప్పల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.
వెంకటేష్.. యాదగిరిగుట్ట పురపాలిక సంఘంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అవసరాల నిమిత్తం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య వద్ద రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కొమురయ్య.. తన భర్తను అప్పు తీర్చాలని వేధించినట్లు మృతుడి భార్య పేర్కొంది. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అందుకే తన భర్త బలవన్మరణం చేసుకున్నాడని విలపించింది.
సంబంధిత వార్త: రూ.6వేల అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నం
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని గుట్ట ఎస్సై రాజు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: వైన్స్ పెట్టె నిండింది.. దొంగ కన్ను పడింది