సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని హాట్యాతండాలో గతేడాది జరిగిన వృద్ధురాలి హత్యకేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రైతుబంధు డబ్బుల కోసం నాన్నమ్మను సొంత మనువడే అతి కిరాతకంగా చంపేశాడు. హాట్యా తండాకు చెందిన తులిసి భాయ్(70) పేరున ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ద్వారా వచ్చే రైతుబంధు డబ్బులు కాజేయాలని ఆమె మనుమడు కిషన్ పథకం వేశాడు. చిన్నాన్న పుండలిక్‌తో కలిసి ఆమెను చంపాలనుకున్నాడు. అందుకు ఎల్కారం తండాకు చెందిన లచ్చిరామ్తో కలిసి గతేడాది అక్టోబర్ 23న పొలంలో ఉన్న ఆమెను వారు రాళ్లతో కొట్టి చంపేశారు.
ఏమి తెలియనట్లు హంతకుడు కిషన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పలునిజాలు తెలిశాయి. దీనితో ఫిర్యాదుదారు అయిన కిషన్‌ను విచారించగా... నిజం ఒప్పుకుని లొంగిపోయాడు. కాగా మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని కంగ్టి సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి: విషాదం... పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి