ETV Bharat / jagte-raho

యథేచ్ఛగా ఇసుక దందా... చూసీచూడనట్లు అధికారుల పంథా! - sand bussiness in maktal

యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా... పరిసర గ్రామాల్లో వివాదాలకు కారణమవుతోంది. తమ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతాయని ఆందోళనలు చేపడుతున్నా... అక్రమార్కులు మాత్రం తమ పని కానిచ్చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదిస్తూ... ఆయా శాఖలకు ముడుపులు అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బహిరంగంగానే రవాణా, గొడవలు జరుగుతున్నా... ఆయా శాఖలు పట్టించుకోకపోవటం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.

sand illigal transport issue in makthal Constituency

author img

By

Published : Nov 6, 2020, 10:29 AM IST

నారాయణపేట జిల్లాలో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. ప్రధానంగా మక్తల్ నియోజకవర్గం కేంద్రంగా... ఇసుక దందా కొనసాగుతోంది. జిల్లాలోని ఊట్కూరు, మాగనూరు, మక్తల్ మండల పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేర పెద్ద వాగు ప్రవహిస్తోంది. ఈ వాగు పరిధిలోనే అక్రమార్కులు ఇసుక దందాను నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ. 40 వేలు, ట్రాక్టర్ రూ.6 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలు జిల్లా వ్యాప్తంగా వివాదాలకు దారితీస్తున్నాయి.

సెప్టెంబర్ నెలలో నారాయణపేట శివారు జలాల్​పూర్​లో ఉన్న ఇసుక డంపు వద్ద జరిగిన గొడవ వ్యవహారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. గత నెల మరికల్ మండలంలోని జిన్నారం వద్ద మణి వాగు నుంచి ఇసుక తరలిస్తుంటే స్థానికులు అడ్డుకోగా... ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్​స్టేషన్​కు వెళ్ళినా... కనీసం కేసు కూడా నమోదు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా మాగనూరు మండలం నెరడగం వాగు నుంచి ట్రాక్టర్​లో ఇసుకను తరలిస్తుండగా స్థానిక రైతులు అడ్డుకున్న ఘటనలో రైతుతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయపడ్డారు. వారిద్దరు ప్రస్తుతం హైదరాబాద్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఊట్కూరు మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అమీన్​పూర్​ వాగు వద్ద ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్​కు అప్పగించి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు అక్రమ రవాణాపై దృష్టి పెట్టాల్సి ఉన్నా... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇసుక దందా ఎక్కువగా జరుగుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముట్టాల్సిన ముడుపులు ముడుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: మద్యానికి బానిసై... ఆర్థిక ఇబ్బందులకు వశమై...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.