ETV Bharat / jagte-raho

కాలాపత్తర్​ రౌడీషీటర్‌ షానూర్ దారుణ హత్య - rowdy sheeter shanoor died

హైదరాబాద్​ పాతబస్తీలో రౌడీషీటర్‌ షానూర్​పై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ షానూర్​... ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు.

Breaking News
author img

By

Published : Jul 20, 2020, 2:20 PM IST

హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంజన్​కాలనీలో రౌడీషీటర్​ షానూర్​పై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతని ఇంటి ముందు తెల్లవారుజామున జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ షానూర్​... ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు పలు హత్య కేసుల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పాత కక్షల కారణంగా... ప్రత్యర్ధి వర్గాలే దాడికి పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సెల్‌ఫోన్​కు వచ్చిన ఫోన్‌ నంబర్ల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాలాపత్తర్ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: డేంజర్ బెల్స్​: గ్రేటర్‌లో కరోనా నలువైపులా విరుచుకుపడుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.