మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి ఆర్ యల్ నగర్లోని వరలక్ష్మీ ఆభరణాల దుకాణంలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. అద్దాలు పగలగొట్టి సుమారు రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆత్మహత్య