మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్మెట్ ఓల్డ్ పీఎస్ దగ్గరలో ధనలక్ష్మి జ్యూవెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 25 తులాల బంగారం, 75 కేజీల వెండిని దుండగులు దోచుకెళ్లారు . ఈ చోరీలో దొంగలు దుకాణంలోని నగలతోపాటు సీసీ కెమోరాలను తీసుకెళ్లారు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. తాము ఎవ్వరికి పట్టుపడొద్దనే ఉద్దేశంతోనే దొంగలు సీసీ కేమోరాలు ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: 15 ఏళ్ల బాలికకు 39 ఏళ్ల వ్యక్తితో వివాహం