కామారెడ్డి జిల్లా టెక్రియల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామానికి చెందిన మచ్చెర్ల స్వామి (37) మృతి చెందారు.
పనులు ముగించుకొని కామారెడ్డి నుంచి మోడేగాం తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామి అకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు మృతి.. యువకుల బ్యాగులో గంజాయి