యాదాద్రి భువనగిరి జిల్లా మన్నేవారి పంపు సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో బీఎన్ తిమ్మాపూర్‌కు చెందిన ఎండీ సల్మన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఎండీ సల్మాన్... ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా మన్నేవారిపంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పక్కా 'పాము' స్కెచ్‌తో భార్యను చంపేశాడు.. కానీ!