ETV Bharat / jagte-raho

లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి - తాండూరు సర్పంచ్ మృతి

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​ వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు తాండూరు సర్పంచ్​గా పోలీసులు గుర్తించారు.

road-accident-in-pragnapur-at-siddipet-district-and-three-members-died
లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి
author img

By

Published : Sep 3, 2020, 7:36 AM IST

Updated : Sep 3, 2020, 9:29 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని.. కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తి తీవ్రగాయలపాలయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఆస్పత్రికి బయలుదేరారు...

మంచిర్యాల జిల్లా తాండూరు సర్పంచ్ అంజిబాబు... సాయి ప్రసాద్, గణేష్, భాను ప్రసాద్ నలుగురు కలిసి తాండూరు నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి కారులో బయలుదేరారు. ఆరు నెలల క్రితం సాయి ప్రసాద్ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొంది... తిరిగి ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తు నిమిత్తం హైదరాబాద్​కు పయనమయ్యారు.

కారు నుజ్జునుజ్జు

సిద్దిపేటలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్దకు రాగానే... వీరి వాహనం రహదారిపై ఆగి ఉన్న మిల్లర్ మిక్సర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... డ్రైవర్ భానుప్రసాద్ తీవ్రగాయాలపాలయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని... జేసీబీ సహాయంతో కారులోని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

విషయం తెలుసుకున్న మృతుల బంధువులు గజ్వేల్ ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పబ్​జీతో వ్యక్తిగత గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే!

Last Updated : Sep 3, 2020, 9:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.