మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఆగి ఉన్న లారీని డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బోయిన్‌పల్లి మార్కెట్ నుంచి గుండ్లపోచంపల్లికి డీసీఎంలో కూరగాయలను తీసుకెళ్తుండగా.. కొంపల్లి సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో మరణించిన డీసీఎం డ్రైవర్ బోయిన్‌పల్లి వాసి వినోద్‌గా పోలీసులు గుర్తించారు. డీసీఎం బలంగా వెనకనుంచి లారీని ఢీకొట్టడంతో.. వినోద్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న వినోద్‌ని స్థానికులు క్రేన్ సహాయంతో బయటకు తీసి అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించగా .. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఖాళీలు భర్తీ చేయాలి: పశువైద్య విద్య పట్టభద్రులు