ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం వంతెనపై బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం నుంచి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
ఒక్కసారిగా రెండు వాహనాలు ఢీకొనటంతో పెద్ద శబ్ధంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వంతెనపై రెండు వాహనాలు ఇరుక్కుపోవడం వల్ల ఖమ్మం సత్తుపల్లి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జెేసీబీ ద్వారా వాహనాలకు పక్కకు తప్పించారు.