కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. మృతులు చొప్పదండి మండలంలోని చిట్యాలపల్లికి చెందిన కొక్కిస మహేష్, అడ్డగుండ చందులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : నా పేరు మీద వచ్చే సందేశాలకు స్పందించకండి: సీఐ