నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ... వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడిక్కడే మృతి చెందింది.
వెల్దండకు చెందిన బాలకిష్టమ్మ (60), కళమ్మ (50) అనే అక్కచెల్లెళ్లు పొలం పనులకు వెళ్లి తిరిగి తమ ఇంటికి చేరుకునే క్రమంలో కారు ఢీకొట్టి మృత్యువాతపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల కోడ్ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్