కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు గోవా ట్రిప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఉల్లాసంగా సాగిన వారి ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. తిరుగు ప్రయాణంలో వికారాబాద్ జిల్లా పరిగి సబ్ స్టేషన్ ముందు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ, వీరి ఎర్టిగా కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుదర్శన్ మృతి చెందగా భానుమూర్తి, చిరంజీవికి తీవ్ర గాయాలయ్యాయి.
మరో ముగ్గురు సల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సహాయంతో ప్రథమ చికిత్స కోసం వీరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నందున హైదరాబాద్‌కు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌పై చిన్నారులకు బొమ్మల పుస్తకం