ETV Bharat / jagte-raho

పెళ్లి బృందం వాహనం బోల్తా.. పలువురికి గాయాలు - బంజర స్టేజీ వద్ద ప్రమాదంలో పలువురికి గాయాలు

అందరూ సంతోషంగా శుభాకార్యానికి వెళ్తున్నారు. అంతలోనే వారికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్​ వాహనం ముందున్న ద్విచక్రవాహనాన్న ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర స్టేజి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

accident in banjara stage in nellikudhuru mandal
బంజర స్టేజి సమీపంలో బోల్తా పడ్డ టాటా ఏస్​ వాహనం
author img

By

Published : Jan 10, 2021, 10:24 PM IST

పెళ్లి బృందంతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. ముందున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర స్టేజి సమీపంలో ఘటన చోటు చేసుకుంది.

స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసముద్రంలో జరిగే ఓ శుభకార్యానికి బంజర నుంచి టాటా ఏస్ వాహనంలో సుమారు 30 మందికి పైగా వెళ్తున్నారు. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడుపుతూ.. ముందున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో అదుపుతప్పి బోల్తా పడింది. టాటా ఏస్​లో ప్రయాణిస్తున్న 11 మంది, ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : దొంగ నోట్ల చెలామణి.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.