ETV Bharat / jagte-raho

లారీని ఢీకొట్టిన బైక్​... ఓ వ్యక్తి మృతి - సంగారెడ్డి నేరవార్తలు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైకు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident at kondapur national high way in sangareddy district
లారీని ఢీకొట్టిన బైక్​... ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Nov 7, 2020, 10:10 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలంలోని మల్కాపూర్​- తుంగమడుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: రియల్​ ఎస్టేట్​ వెంచర్​పై దాడి.. గంజాయి, మత్తు పదార్థాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.