ETV Bharat / jagte-raho

మాంసం దుకాణాలపై కొనసాగుతున్న దాడులు - rides on mutton shops in hyderabad

బోయిన్​పల్లిలోని మాంసం దుకాణాలపై పశు సంవర్ధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మటన్​ విక్రయిస్తున్న 2 దుకాణాలను సీజ్​ చేశారు.

rides on mutton shops in hyderabad
మాంసం దుకాణాలపై కొనసాగుతున్న దాడులు
author img

By

Published : Apr 29, 2020, 10:07 AM IST

జంట నగరాల్లో మాంసం దుకాణాలపై దాడులు కొనసాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ ఆదేశాల మేరకు ఐదుగురు అధికారులతో ఏర్పాటైన పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం.. బోయిన్​పల్లిలోని మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. 13 దుకాణాల్లో మటన్‌ నాణ్యత, ధరల హెచ్చుతగ్గులు, ఇతర అంశాలపై విస్తృత తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మటన్ విక్రయిస్తున్న 2 దుకాణాలను సీజ్ చేశారు.

ఈ తనిఖీలు వారంరోజుల పాటు కొనసాగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు. మటన్ అధిక ధరలకు విక్రయిస్తే 9848747788 నెంబర్​కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తనిఖీల్లో అధికారుల బృందం కన్వీనర్ డాక్టర్ బాబు బేరి, డాక్టర్ సింహారావు, డాక్టర్ ఖాద్రి, డాక్టర్ సుభాశ్​, డాక్టర్ నిజాం తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి: హుస్నాబాద్​లో నిషేధిత గుట్కా, నాటుసారా పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.