కిడ్నాపర్ రవిశేఖర్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2001 నుంచి నేరాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశేఖర్... రవి అలియాస్ శ్రీధర్ రెడ్డి అలియాస్ రవీందర్ బాబు అలియాస్ అశోక్ బాబు అనే పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 2001లో మొదటిసారిగా బంధువునే మోసం చేసిన ఆయన... ఎక్కువగా ప్రభుత్వ అధికారిగా చెప్పుకొంటూ డబ్బు కోసం మోసాలకు చేస్తున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ, ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో తనిఖీ కోసం విజిలెన్స్ అధికారిగా దాడులు చేసి... మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు తెలిసినట్లు సీపీ వివరించారు. నిందితుడిపై ఇప్పటికి 55 కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు.
ఇదీ చూడండి: పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష