కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలోని ఓ మిల్లు నుంచి రేషన్ బియ్యం రవాణా చేసేందుకు నిందితులు ఓ లారీని సిద్ధంచేసినట్లు పోలీసులకు సమాచారం అందగా.... దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 105 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ బియ్యాన్ని శంకరపట్నంలోని ఓ మిల్లుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. రాజాపూర్‌లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి తిరిగి రీసైక్లింగ్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సివిల్‌సప్లై శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు వివరించారు. అక్రమ బియ్యం వ్యవహరంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శశిధర్ తెలిపారు