ETV Bharat / jagte-raho

మైనర్​ బాలికపై వీఆర్​ఏ అత్యాచారం.. కేసు నమోదు - ముకుందాపురంలో మైనర్​ బాలికపై వీఆర్​ఏ అత్యాచారం వార్తలు

మానసిక వికలాంగురాలైన మైనర్​ బాలికపై వీఆర్​ఏ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Rape of a mentally handicapped minor girl in Suryapet district
మైనర్​ బాలికపై వీఆర్​ఏ అత్యాచారం.. కేసు నమోదు
author img

By

Published : Oct 27, 2020, 11:58 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వీఆర్​ఏ.. మానసిక వికలాంగురాలైన మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన మానసిక వికలాంగురాలైన మైనర్ బాలిక దసరా పండుగ సందర్భంగా తన అమ్మమ్మ గ్రామమైన ముకుందాపురానికి వచ్చింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వీరయ్య అనే వీఆర్ఏ మద్యం మత్తులో ఒంటరిగా కనిపించిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పగా ఆమె తాతయ్య పగిళ్ల సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న ఎస్సై దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని.. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

ఇదీ చూడండి.. 'హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.