సోషల్ మీడియా ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇస్టాగ్రాం ఆధారంగా సైబర్ క్రైమ్‌లకు పాల్పడుతున్న ముఠాను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఛారిటీకి సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతాయంటూ... ఓ బాధితురాలికి కుచ్చుటోపి పెట్టి 29 లక్షల రూపాయలను మోసం చేశారు.
భక్తి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాలని ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తామంటూ బురిడీ కొట్టించాడు. సోనియా శర్మ పేరుతో బాధితురాలికి ఫోన్, మెయిల్ల ద్వారా ఉచ్చులోకి దింపారు. డిపాజిట్‌కు ముందు కొన్ని కస్టమ్స్, ఆర్బీఐ ఛార్జీలు చెల్లించాలంటూ 29 లక్షల రూపాయలను వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులను పట్టుకునేందుకు దిల్లీలో సోనియా కమ్యూనికేషన్స్ వద్ద నగదు డ్రా చేసినట్లు గుర్తించారు. సోనియా కమ్యూనికేషన్‌పై నిఘా వేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నైజీరియాకు చెందిన చిబుకి క్రిస్టియన్, అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోనియా కమ్యూనికేషన్ వీళ్లిద్దరికీ 15 శాతం కమిషన్ ఇస్తుందని, నైజీరియన్‌ను అరెస్టు చేసే సమయంలో కానిస్టేబుల్, ఆర్‌ఐలపై దాడి చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.
వీరి వద్ద నుంచి నాలుగు పీఓఎస్ మిషిన్లు, ఒక ల్యాప్‌టాప్, 2 సెల్ఫోన్లు, 74వేల డిపాజిట్ స్లిప్లు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీప మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ పోరులో వంద స్థానాలు సాధిస్తాం : కేటీఆర్