యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ పోలీస్స్టేషన్ ఎదుట రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గడ్డం కాశీం ధర్నా నిర్వహించారు. మండలంలోని చాడ గ్రామానికి చెందిన గోపాల్, గత నవంబర్ 30న తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు.
నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కాశీం డిమాండ్ చేశారు. ఇకనైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఈ అంశంపై స్పందించిన ఎస్సై.. కేసు ఇదివరకే నమోదు చేశామన్నారు. దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రూపాయి పలకని టమాట ధర.. రోడ్డుపై పడేసి రైతుల నిరసన