అక్రమంగా తరలిస్తోన్న గుట్కా, నాటుసారా ప్యాకెట్లను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుస్నాబాద్ శివారులో తనిఖీ నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
జిల్లెల గడ్డకు చెందిన గంగులోతు శ్రీకాంత్, హుస్నాబాద్‌కు చెందిన భూక్య రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, సారా వంటివి ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.