హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఓ ఖైదీ బలవర్మణానికి పాల్పడ్డాడు. చర్లపల్లి జైలులో చిన్న బాలరాజు(37) జీవిత శిక్షను అనుభవిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎండిర్యాల గ్రామానికి చిన్న బాలరాజు జీవిత శిక్షను అనుభవిస్తూ జైలులో మానసిక వ్యాధికి గురయ్యాడు. అతన్ని ఈ నెల 3న చికిత్స నిమిత్తం జైలు అధికారులు మానసిక వైద్యశాలకు తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం బాలరాజు వైద్యశాలలోని స్నానాల గదిలో టవల్‌తో కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు