యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దర్శనానికి వచ్చి ప్రమాదానికి గురై ఎల్బీనగర్ కామినేనిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందింది. ఈ నెల 9న హైదరాబాద్ చైతన్యపురికి చెందిన ప్రణతి కుటుంబసభ్యులు పాతగుట్టలో దర్శనం అనంతరం... చలువ పందిళ్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో విధుల్లో భాగంగా రాచకొండ పోలీసులు అక్కడికి వచ్చారు. రక్షక్ వాహనాన్ని నిలిపే క్రమంలో వెనక ఉన్న చిన్నారి ప్రణతికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం వెంటనే ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజులుగా చికిత్స పొందుతన్న ప్రణతికి గుండె పనిచేయడం లేదంటూ వైద్యులు తండ్రికి చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు మృతి చెందింది. పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని చైతన్యపురిలోని ఇంటికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రణతి తండ్రి మల్లేష్ విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.
ఇవీ చూడండి: పోలీస్ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి