ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో బిల్​ బాయ్​​ మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన - lineman died at miryalguda

ట్రాన్స్​ఫారం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై లైన్​మెన్ కింద పని చేసే బిల్​ బాయ్​​ మరణించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రకాశ్​నగర్​లో జరిగింది. ఆదుకోవాలంటూ మృతుని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

power employees protest as line man died due to current shock in miryalaguda
విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి.. తోటి ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Oct 3, 2020, 11:31 AM IST

Updated : Oct 3, 2020, 12:55 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్​నగర్​లో లైన్​మెన్ కింద​ పనిచేసే బిల్​బాయ్​ రఘు.. ట్రాన్స్​ఫారం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రకాష్​నగర్​లో ఉంటున్నారు. ఇంటింటికి విద్యుత్​ బిల్లులు అందిస్తూ విద్యుత్​శాఖలో బిల్​బాయ్​గా ప్రైవేట్​ ఉద్యోగం చేస్తున్నాడు.

ప్రకాష్​నగర్​లో కొత్తగా విద్యుత్​ లైన్లు వేస్తున్నారు. అసిస్టెంట్​ లైన్​మెన్​తో చేయించాల్సిన పనిని రఘుతో చేయించారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు కారణమైన కాంట్రాక్టర్​పై తగిన చర్యలు తీసుకోవాలని.. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చదవండి: పెద్దపల్లిలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలి : అటవీ శాఖ

Last Updated : Oct 3, 2020, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.