హైదరాబాద్ వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్ ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వాహనంతో పాటు దాదాపు రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మే నెలలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ సిబ్బంది దృష్టి మరల్చి రూ.70లక్షల నగదు అపహరించారు.
ఇదీ చూడండి: పనామా చోరీ రాంజీ గ్యాంగ్ పనేనా?