నిషేధిత గుడుంబా తయారీ చేయొద్దని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదని పోలీసులు తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పోలీసులు పట్టుకున్నారు.
వర్ధన్నపేట శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 300 కిలోల నల్లబెల్లం, 60కిలోల పటికలను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పశువులను మేపేందుకు వెళ్లి...విద్యాదాఘాతానికి బాలుడు బలి