అకారణంగా పోలీసులు తనపై దాడి చేశారని ఫార్మసిస్టు రామారావు ఆరోపించాడు. బాధితుడి కథనం ప్రకారం.. బుధవారం అర్థరాత్రి తన క్వార్టర్ పక్కన అలికిడైతే బయటికి వచ్చానని.. అదే సమయంలో పోలీసులు పక్కింటి తాళాలు పగులగొడుతున్నారని తెలిపాడు. తనను పిలిచి నువ్వు ఎవరంటూ అడుగుతూ.. ఇష్టానుసారంగా కొట్టారని ఆరోపించాడు.
ఆధార్ కార్డు చూపించాలంటూ బూతులు తిట్టారని వాపోయాడు. సింగరేణిలో పనిచేసే ఫార్మసిస్టునని చెప్పగా వెనక్కి తగ్గారని వివరించాడు. రాత్రే 100కు డయల్ చేశానని చెప్పుకొచ్చాడు. దాడి చేసిన పొలీసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇవీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి