ETV Bharat / jagte-raho

2 లక్షలు.. 20 రోజులు.. మొత్తానికి పట్టేశారు!

బాధితుడు పోగొట్టుకున్న రూ.2 లక్షలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 20 రోజులు కష్టపడి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు. ఇంతకీ ఎలా పట్టుకున్నారు?

author img

By

Published : Dec 18, 2020, 10:15 PM IST

police found-2 lakhs
2 లక్షలు.. 20 రోజులు.. మొత్తానికి పట్టేశారు!

ద్విచక్ర వాహనంపై వెళ్తూ బాధితుడు పోగొట్టుకున్న రూ.2 లక్షలను 20 రోజులు కష్టపడి మరీ.. వెతికి పట్టుకున్నారు చంద్రాయణగుట్ట పోలీసులు. బాధితుడు ప్రయాణించిన దారి పొడవునా సీసీ కెమెరాలు తనిఖీ చేసి.. పడిపోయిన డబ్బులు ఇద్దరు వ్యక్తులకు దొరికినట్లు గుర్తించారు.

చంద్రాయణగుట్టకు చెందిన మహేష్... గత నెల 28న ద్విచక్ర వాహనంపై వెళ్లూ రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగ్​ పోగొట్టుకున్నాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఛాలెంజింగ్ గా తీసుకున్న చంద్రాయనణగుట్ట డిటెక్టివ్​ ప్రసాద్ వర్మ ఏడుగురితో టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల సహాయంతో డబ్బులు తీసుకున్న వ్యక్తుల ఆచూకీ కనుగొని.. వారి నుంచి డబ్బు తిరిగి బాధితుడికి అందజేశారు. పోగొట్టుకున్న డబ్బులు తనకు అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా: 15ఎకరాల్లో ప్రధాని నివాస సముదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.