వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన సమ్మయ్య ఇంట్లో గుట్కా బ్యాగులు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ఫెక్టర్లు నందీరామ్ నాయక్, మధు తమ సిబ్బందితో సోదాలు నిర్వహించారు.
5 బ్యాగుల్లో నిల్వ ఉంచిన సుమారు 2 లక్షల 57 వేల 500 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సమ్మయ్య తన మిత్రుడైన రాజుతో కలిసి ఇదే మండలానికి చెందిన కార్తిక్ వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుట్కాలు కొనుగోలు చేశారని... వీటిని గ్రామాల్లోని కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్పై సుప్రీం తీర్పు రిజర్వు