ETV Bharat / jagte-raho

ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హయత్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరికాలనీలో ఈ నెల 13న జరిగిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు చీదర్ల వినయ్, కొండ రాఘవేందర్​ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Police cracked hdfc ATM theft case in hyderabad
ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Sep 17, 2020, 4:01 PM IST

హైదరాబాద్​ హయత్​నగర్​లోని రాజరాజేశ్వరికాలనీలో ఈ నెల 13న జరిగిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు చీదర్ల వినయ్, కొండ రాఘవేందర్​ను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన వినయ్ ఏటీఎంల్లో డబ్బులు జమచేసే ఉద్యోగని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వినయ్ సెక్యూర్ వాల్యూ కంపెనీలో గత 20 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు.

అతని స్నేహితుడు రాఘవేందర్ లాక్​డౌన్ నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలని పథకం వేసి వినయ్​కి చెప్పాడు. ఇద్దరు కలిసి ఏటీఎంలో డబ్బులు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 11న డ్యూటీలో భాగంగా వినయ్​ హయత్​నగర్ రాజరాజేశ్వరికాలనీలో ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఏటీఎంలో 13 లక్షల నగదు పెట్టి వెళ్లాడు. అనంతరం రాఘవేందర్​కి సేఫ్ పాస్వర్డ్ చెప్పగా.. 13న ఏటీఎంలోకి వెళ్లిన రాఘవేందర్ సేఫ్ పాస్వర్డ్​తో ఉపయోగించి 9 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు.

ఇదీ చదవండి: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.