దుర్గం చెరువు తీగల వంతెనపై ఆకతాయిల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. నిబంధనలు పాటించండని ఎంతలా చెబుతున్నా కొందరి తీరు మారడం లేదు. రోడ్డు మధ్యలో స్వీయచిత్రాలు, వంతెన చివర్లో కూర్చుని పోజులిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు కేబుల్ బ్రిడ్జి రోడ్డు మధ్యలో ఫోటోలు దిగుతుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని... దానికి సంబంధించి సీసీ టీవీలో నిక్షిప్తమైన దృశ్యాలను సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించి బ్రిడ్జిపై ఫోటోలు, సెల్ఫీలు దిగితే కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: నకిలీ తాళాలు తయారు చేస్తున్న ఇద్దరు అరెస్టు