వరంగల్ నగరం నడి బొడ్డున, యూనివర్సిటీ రోడ్డులో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యభిచారం గృహంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఐదుగురు యువతుల, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో కొన్ని నెలలుగా జరుగుతున్నా... అక్కడ ఉన్న ఎవరికి అనుమానం రాలేదు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేశారు. పోలీసులు పట్టుకున్న విటుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. విటులు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా ఈ దాడి జరుగడం చూసి చుట్టుపక్కలవారు ఖంగుతిన్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: పార్లమెంటు సమావేశాల కోసం విపక్షాల అస్త్రశస్త్రాలు