ETV Bharat / jagte-raho

దొంగల అరెస్ట్​, 12 తులాల బంగారం స్వాధీనం - latest crime news in mahabubabad district

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగిన రెండు దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 6 లక్షల 86 వేల 500 రూపాయల విలువ గల 12 తులాల బంగారు కడ్డీ , 15 తులాల వెండి ఆభరణాలు, 43 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.

police arrested two thieves in mahabubabad district
దొంగల అరెస్ట్​, 12 తులాల బంగారం స్వాధీనం
author img

By

Published : Aug 25, 2020, 10:38 PM IST

జిల్లా కేసముద్రం మండలంలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నాడని అతడిని కూడా త్వరలోనే అరెస్ట్​ చేస్తామన్నారు.

గత నెల జులై 2న కేసముద్రం మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ బంగారం దుకాణానికి నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన చీకటి కిరణ్, మధ్యప్రదేశ్ భూపాల్​కు చెందిన షబ్బీర్ వెండి పట్టీలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. వాటిని చూస్తూ యజమాని దృష్టిని మరల్చి 12 తులాల బంగారు కడ్డీ దొంగిలించారు.

మరో కేసులో కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన రాంప్రసాద్ , అదే గ్రామానికి చెందిన బిచ్చగాడు కిన్నెర యాదగిరి ఇనుప పెట్టె తాళం పగలకొట్టి అందులో ఉన్న నగదు 43 వేల రూపాయలు, 15 తులాల వెండి ( 7500 రూపాయల విలువ చేసేవి )ని దొంగలించాడు. రెండు కేసుల్లో నిందితులను అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి- బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.