ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈ నెల 20న జరిగిన హత్య కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుర్రిపాలెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి తన అన్న కుమారుడు మరళీకృష్ణతో పొలం దారి విషయంలో వివాదం నేపథ్యంలో.. ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి గతంలోనూ గొడవలు జరిగాయని.. కృష్ణమూర్తి పేరిట ఉన్న పొలంలో మురళీకృష్ణ వరి పంట వేయగా... దాన్ని కృష్ణమూర్తి దున్నించాడు.
ఈ విషయంలో పెదనాన్నపై కక్షగట్టిన మురళీకృష్ణ.. చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పథకం ప్రకారం ఈ నెల 20వ తేదిన కృష్ణమూర్తి పొలానికి వెళ్తున సమయంలో అతనిపై కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశాడని.. మురళీకృష్ణతో పాటు అతని కుమారులు, భార్య ఈ దాడిలో పాల్గొన్నారని తెనాలి గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితులను ఈనెల 25వ తేదిన నందివెలుగు అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని వారినుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు తెనాలి డీఎస్పి స్రవంతి రాయ్ తెలిపారు.
ఇదీ చదవండి: హిజ్రాల హల్‌చల్.. 10మంది అరెస్ట్