పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు రూరల్ సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో దాడులు చేశారు.
నగదు స్వాధీనం
16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ. 3,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న బోధన్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు
ఇదీ చదవండి:'తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే హత్యానేరం'