ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి పరిస్థితి విషమం - person died in raod accdient at thaduru mandal

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

person died in road accident at thaduru mandal lingampally nagar kurnool district
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి పరిస్థితి విషమం
author img

By

Published : Jan 18, 2021, 10:32 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడిపూర్​కు చెందిన లక్ష్మణ్, శివ, మల్లేష్​ ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఆటోని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ బైక్‌ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ, మల్లేష్​కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వటంతో బాధితులను నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఎవరైనా హత్య చేశారా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.