ETV Bharat / jagte-raho

సెల్ఫీ వీడియో: తల్లి అంగీకరించలేదని ఆత్మహత్య

హైదరాబాద్​లో సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను మరువకముందే తాజాగా సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Dec 7, 2020, 10:34 PM IST

person committed suicide with selfie video in mahabubabad
సెల్ఫీ వీడియో: తల్లి అంగీకరించలేదని ఆత్మహత్య

హైదరాబాద్​లో నూతన గృహాన్ని కొనుగోలు చేసేందుకు తల్లి అంగీకరించక పోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

గుగులోత్ హనుమ, సత్తెమ్మల కుమారుడు ప్రశాంత్ లాక్​డౌన్‌కు ముందు హైదరాబాద్​లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించాడు. లాక్​డౌన్​తో ప్రశాంత్ దంపతులు బయ్యారంలో ఉంటున్న అతని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇక్కడి ఇంటిని అమ్మి హైదరాబాద్​లో ఇల్లు కొందాం అనేవాడు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తరచూ ఇంట్లో ఘర్షణలు జరిగేవి. ఈ రోజు తన గదిలోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుతో బయ్యారం ఎస్ఐ జగదీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.