ETV Bharat / jagte-raho

డాలర్లు పంపిస్తానని నమ్మించి రెండు లక్షలు కొట్టేశాడు.. - సైబర్​ నేరగాళ్లు

సైబర్​ నేరగాళ్లు పంథా మార్చుకుంటున్నారు. స్నేహం ముసుగులో అమాయకులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. అమెరికా నుంచి డాలర్లు పంపిస్తాను... అంటూ నమ్మబలికి ఓ అమాయకురాలిని మోసం చేశాడు ఓ సైబర్​ నేరగాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

online cheating in hyderabad
డాలర్లు పంపిస్తానని నమ్మించి రెండు లక్షలు కొట్టేశాడు..
author img

By

Published : Sep 16, 2020, 7:48 PM IST

ఆన్​లైన్​లో స్నేహమంటేనే వామ్మో అనుకోవాల్సిన పరిస్థితి. స్నేహం.. ప్రేమ ముసుగులో అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు సైబర్ దొంగలు. హైదరాబాద్​ అశోక్​నగర్​కు చెందిన శ్రీవిద్యకు ఫేస్​బుక్​లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. ఆ యువతి తనను పూర్తిగా నమ్మేంత వరకు స్నేహాన్ని కొనసాగించాడా సైబర్ దొంగ. మన స్నేహానికి గుర్తుగా 65లక్షల యూఎస్ డాలర్లు పంపిస్తాను అన్నాడు. ఆ యువతి వద్దని చెప్పినా ఆ దొంగ వదల్లేదు. తన బహుమతి స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాడు.

తాను పంపించే డబ్బు నీకు అవసరం లేకపోతే సాధ్యమైనంత వరకు సమాజ సేవ కోసం ఖర్చు పెట్టమని... వ్యక్తిగత అవసరాలున్నా నిర్మొహమాటంగా వాడుకోవచ్చని పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆ తర్వాత మీకో పార్శిల్ వచ్చింది. ఇందులో అమెరికన్ కరెన్సీ ఉంది కాబట్టి కస్టమ్స్​, జీఎస్టీ, ఇన్​కంటాక్స్ వంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. శ్రీవిద్య నమ్మి రెండు లక్షల పైచిలుకు సొమ్మును ఆ దొంగల ఖాతాకు ఆన్​లైన్​లో బదిలీ చేశారు. కానీ ఆ బహుమతి పార్శిల్ తనకు రాలేదు. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ ఉంది. దాంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:ఎస్సై పేరిట నకిలీ ఫేస్​బుక్... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.