సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడికి డబ్బు అవసరం వచ్చింది. అతని స్నేహితుడిని పైసలు అడగ్గా ఆన్లైన్ యాప్ ద్వారా రుణం తీసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన పవన్ 10 యాప్ల ద్వారా రూ. 70 వేల వరకు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఎంత చెల్లించినా మళ్లీ మళ్లీ చెల్లించాలంటూ కొంతమంది ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేశారు.
అదే సమయంలో ఇతని ఫోన్లో సమాచారాన్ని ఫోన్ నెంబర్లను రుణం ఇచ్చే సమయంలో తీసుకుని వారికి ఫోన్ చేసి రుణం ఎగవేతదారులుగా ప్రచారం చేస్తున్నారు. అమ్మాయిల బ్రోకర్ అని రకరకాలుగా వేధింపులకు గురి చేశారు చివరకు పవన్ తండ్రి నారాయణ రావుకు ఫోన్ చేశారు. కొడుకు పరిస్థితి చూసిన ఆయన కొంత నగదు చెల్లించారు. ఇలా తండ్రీకొడుకులు రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు చెల్లించారు. అయినా వేధింపులు ఆగకపోవటంతో శుక్రవారం పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: పెద్దలు పెళ్లికి నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్య