ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురం భీం ప్రాంగణపు మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంకు చెందిన ఇస్రో, బీజాబాయిల కుమారుడు ప్రకాశ్(21)... ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్లోని తన బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చాడు.
స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో పూలాజీ బాబా పాఠశాల సమీపాన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాశ్... ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడిని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.