మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్లల ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు గేదెను ఢీ కొట్టారు. ఘటనలో ఒకరు మృతిచెందగా... ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
లక్షెట్టిపేట మండలం అంకతి పల్లెకు చెందిన రాజశేఖర్, వినయ్, వసంత్ ముగ్గురు ద్విచక్రవాహనంపై మంచిర్యాల వైపు వెళ్తుండగా.... రహదారిపై అడ్డంగా ఉన్న పశువులను వేగంగా ఢీ కొట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో రాజశేఖర్ మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.