ETV Bharat / jagte-raho

ఎస్సై భార్య వేధింపులతో తాపీ మేస్త్రీ ఆత్మహత్య..! - తాపీ మేస్త్రీ బలవన్మరణం

ఎస్సై భార్య వేధింపులకు గురిచేస్తోందని ఓ తాపీ మేస్త్రీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదని అవమానాలకు గురిచేయడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండల కేంద్రంలో ఘటన జరిగింది.

one person suicide in nagar kurnool district lingala mandal
ఎస్సై భార్య వేధింపులతో తాపీ మేస్త్రీ ఆత్మహత్య
author img

By

Published : Dec 19, 2020, 5:43 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా లింగాల మండలం కేంద్రంలో తాపీ మేస్త్రీ సోమ్లానాయక్(45) ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మెట్రోలో ఎస్సైగా పనిచేస్తున్న లక్ష్మయ్య భార్య ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదని అతన్ని వేధింపులకు గురి చేసింది. అతను అవమానాలు భరించలేక ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండల కేంద్రంలో ఘటన జరిగింది.

ఎస్సై భార్య కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టడం ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఇంటికి వచ్చి ఎప్పుడు గొడవ పడుతుండేదని.. బంధువులతో వచ్చి దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టిందని మృతుని భార్య మంగమ్మ ఆరోపించింది. పోలీసులు జోక్యం చేసుకుని బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.