నిజామాబాద్ జిల్లా బాల్కొండ బైపాస్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మెండోరాకు చెందిన మాకూరి వినోద్.. తన భార్య, ఐదు నెలల కూతురిని ఆర్మూర్ మండలం చేపూర్‌లోని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మెండోరాకు వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని కంటైనర్ వాహనం ఢీకొట్టింది. దీంతో వినోద్ తలకు గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఐదు నెలల కూతురు ఉంది. వినోద్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై శ్రీహరి పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇవీ చూడండి: వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు